Friday 19 September 2014

నామజపమును చేయుట ద్వారా దుఃఖమును ప్రారదోలవచ్చును !


దుఃఖమునకు మూల కారణము భౌతిక విషయాల పట్ల గల ఆసక్తి. నామజపమును చేయుట వలన మనలో భగవంతుని యెడల ప్రేమ పెరిగి, భౌతిక వస్తువుల పట్ల గల సంబంధము తెగిపోయి, దుఃఖము మాయము అవుతుంది.



ప్రస్తుత కలియుగములో అతి సులభమైన సాధన 'నామ జపమును' చేయడము. నామజపము చేయుట వలన మన స్థూల దేహము మాత్రమే కాకుండా, మన శరీరము చుట్టూ గల సూక్ష్మ దేహముల శుద్ధి కూడా అవుతుంది.
రోజుకి కనీసము 10 నిమిషాలు అయిన 'శ్రీ కుల దేవతయై నమః' అనే జపమును చెయ్యండి. ఎవ్వరికైతే తమ ఇలవేల్పు దేవత పేరు తెలుసో, వారు కుల దేవత పేరుకి బదులుగా ఆ దేవత పేరు పెట్టి చెయ్యండి..
ఉదాహరణకు మీ కుల దేవుడు వెంకటేశ్వర స్వామి అయితే 'శ్రీ వేంకటేశాయ నమః' అని, కుల దేవి భవాని మాతా అయితే 'శ్రీ భవాని మాతాయై నమః' అని చెయ్యండి..ఒక్కవేళ కుల దేవుడు మరియు కుల దేవి ఇద్దరూ ఉంటే, కుల దేవి పేరునే పలకండి...

No comments:

Post a Comment