Friday 12 September 2014

శంఖ నాదము

శంఖమును పూజలో రెండు విధములుగా ఉపయోగిస్తారు. పూజకు ముందు ఒక్క శంఖమును పూరిస్తారు, మరొక్కటి పూజలో ఉపయోగిస్తారు. ఏ శంఖమును అయితే పూరించడానికి ఉపయోగిస్తారో, దానిని పూజలో పెట్టకూడదు. శంఖమును పూరించకుండా దేవాలయ తలుపులను తెరువరాదని ‘వరాహ పురాణము’లో చెప్పబడినది. వాతావరణములో సత్త్వ, రజ, తమో గుణ తరంగములు ఉంటాయి. ఇందులో రాజ, తమ గుణములు చెడుదాయకమైనవి. పూజా సమయములో సత్త్వ తరంగములు ఆకర్శించబడుతాయి. ఇవి పూజ చేసేవారికి లభించకుండా చెడు తరంగములు ఇబ్బందిని కల్గిస్తాయి.


ఎప్పుడైతే పూజకు ముందు శంఖమును పూరిస్తామో, అప్పుడు శంఖము నుండి శక్తి వెలువడుతుంది. ఈ శక్తి చెడుదాయక తరంగములను నాశనము చేస్తుంది. దీనితో పాటుగా చైతన్య కవచము పూజా ఉపకరణముల చుట్టూ నిర్మాణము అవుతుంది.
శంఖ నాదము వలన మరొక్క లాభము కూడా ఉంది. శంఖమును పూరించినప్పుడు, బ్రహ్మాండములో గల విష్ణు తత్త్వము కార్యగతము అయ్యి, పూజా ప్రదేశంలో ఆకర్శించబడుతుంది. దీని వలన పూజా చేసే వారితో పాటుగా శంఖమును ఊదిన వారికీ, శంఖ నాదమును విన్నవారికి కూడా దీని లాభము కలుగుతుంది.

No comments:

Post a Comment