Sunday 21 September 2014

హనుమంతుని శరీరమునకు సింధూరమును ఎందుకు పూస్తారు ?


సీతమ్మ తల్లి తన నుదుటికి సింధురమును పెట్టుకొంటారు. హనుమంతుడు అది చూసి, ‘సీతమ్మ తల్లి, మీరు ప్రతి రోజు ఎందుకు నుదిటికి సింధూరము పెట్టుకొంటారు?’ అని అడుగుతారు. అప్పుడు సీతమ్మ తల్లి ‘శ్రీరాముని ఆయుష్షు పెరుగాలని పెట్టుకొంటాను’ అని చెబుతుంది. అప్పుడు హనుమంతుడు ‘నుదిటి మీద పెట్టుకొంటేనే శ్రీరాముని ఆయుష్షు పెరిగితే, వొళ్ళంతా పెట్టుకొంటే ఇంకా ఎంత ఆయుష్షు పెరుగుతుందో?’ అనే ఆలోచనతో తన వొల్లంత సింధురమును రాసుకొంటారు. అప్పటి నుండి హనుమంతుని శరీరము సింధూరము రంగుగా మారినది.



హిందువుల్లారా, ఈ కథను బట్టి హనుమంతుడు శ్రీరాముని నిజమైన భక్తుడని వెల్లడవుతుంది. ఆయన శ్రీరాముడి గురించి ఏదైనా చెయ్యడానికి తయారుగా ఉండేవారు. అందుకనే హనుమంతుడు శ్రీ రామునికి అత్యంత ప్రియమైనారు. మనము కూడా సదా వారి సేవలో నిమగ్నమయ్యి ఉంటె ఆ భగవంతునికి అత్యంత ప్రియపాత్రులము అవుతాము.

Friday 19 September 2014

శ్రీ సరస్వతి దేవి


శ్రీ సరస్వతి దేవి విద్యకు దేవి మరియు ఆరాధ్య దేవి. సరస్వతి పదము సరసఃఅవతి అనే పదము నుండి ఉద్బవించినది. దీని అర్థము ఒక్క గతిలో జ్ఞానమును ప్రసాదించడము. సరస్వతి దేవి నిష్క్రియ బ్రహ్మకు సక్రియ రూపము అయినది. అందుకనే ఈమెను ‘బ్రహ్మ-విష్ణు-మహేశ్వరు’లకు గతిని ఇచ్చే శక్తిగా భావిస్తారు.
వసంత పంచమి రోజున సరస్వతి దేవి తారక శక్తి బ్రహ్మాండములో వస్తుంది. ఈ శక్తి జీవుని దేహములోని బుద్ధి కేంద్రమును జాగృతము చేస్తుంది. ఈ జాగరణ ద్వారా సాత్త్విక కార్యము చేయుటకు దిశ లభిస్తుంది.

"హొలీ"


దీనికే మరో పేరు "రంగపంచమీ"
హొలీ పుట్టుక గూర్చి మన "భవిష్య పురాణం " ఈ విధంగా చెప్తోంది.
పూర్వం ఒక వూరిలో ఓక దుష్ఠ శక్తి పిల్లల్ని విపరీతమైన ఇబ్బందులకు గురిచేస్తూ ఆనందాన్ని పొందేది. ఒక రోజు ఆ ఊరి ప్రజలు అందరు ఆ దుష్ఠ శక్తిని తులనాడుతూ, తిడుతూ ఒక నిప్పు వెలిగించి మొత్తం ఊరు నుంచి దానిని తరిమేశారు.
 

పురాణేతిహాసపరంగానైతే "హిరణ్యకసుపుడు " అఖిలాండ బ్రహ్మాండనాయకుడైన నారాయుడి పై ద్వేషముతో ముల్లోకాలను పీడిస్తుండగా ఆతని కుమారుడైన ప్రహ్లాదుడు సర్వం విష్ణు మయం అని ఆతని భక్తుడైనాడు. అది రుచించని ఆతని తండ్రి తన సహొదరి అయిన హొలికకు ప్రహ్లాదుని తీసుకుని అగ్ని గుండం పై కూర్చోమన్నాడు. హోలికకు ఉన్న వరప్రసాదం వలన తనకు ఏమి కాదు అనుకున్న హొలిక అలాగే కూర్చోగానే, ఒడిలో వున్నా ప్రహ్లాదుడు విష్ణు నామస్మరణలో వుండగా ఆతని అత్త కాలి బూదిడ అయినది. ద్వేషం పై కోపం పై అన్యాయం పై భక్తీ గెలిచిన ఈ రోజున హొలీ చేసుకుంటారు.
హొలీ రోజున హొలికదహనమ్ చేస్తారు. ఇందులోని సదుద్దేశం ఏమిటంటే దహనానికి వాడే అన్ని కూడా ప్రకృతిని శుద్ధి చేసే వనమూలికల వృక్షపు బెరల్లు మొదలగునవి. వీటి ద్వారా ప్రకృతిలో జేరిన దుష్టశక్తిని ప్రాలద్రోలవచ్చునని మన పూర్వికుల నమ్మకం. దహనం పూర్తి అయిన తర్వాత దానిపై నేతిని, పాలని చల్లుతారు. తర్వత భందువులకి స్నేహితులకి పళ్ళు పలహారాలు పంచి రంగుల పంచమి మొదలు పెడతారు
పండుగ:- ఈ పండుగను ఒకొక్కరు ఒక్కోక విధంగా జరుపుకొనుచున్నారు
కొన్ని ప్రాంతాలలో డోలయాత్ర ,శింగ ,హుతషని మహోత్సావ్ ,కామదహనం , వసంతోత్సవ్ అని వివిధ పేర్లతో జరుపుకోనుచున్నారు
కొన్ని ప్రాంతాలలో వసంత ఋతువును ఆహ్వానించుటకు ఈ పండగను చేస్తారు. ఆ ఆ ప్రాంతాలు బట్టి పండుగ చేసుకునే రోజులు కూడా పెరుగుతాయి. ప్రకృతి సహజమైన రంగులను అందరు చల్లుకుంటూ ఆనందాన్ని, ఆత్మీయతను తమ లోగిలిలోకి రావాలని అందరు సంతోషంగా వుండాలని ఈ పండుగ జరుపుకుంటారు. ఈ పండుగ మీ జీవితాలలోకి సంతోషాన్ని సంపదనుతేవాలని మనస్పూర్తిగా మీ అందరికి హొలీ శుభాకాంక్షలు.

నామజపమును చేయుట ద్వారా దుఃఖమును ప్రారదోలవచ్చును !


దుఃఖమునకు మూల కారణము భౌతిక విషయాల పట్ల గల ఆసక్తి. నామజపమును చేయుట వలన మనలో భగవంతుని యెడల ప్రేమ పెరిగి, భౌతిక వస్తువుల పట్ల గల సంబంధము తెగిపోయి, దుఃఖము మాయము అవుతుంది.



ప్రస్తుత కలియుగములో అతి సులభమైన సాధన 'నామ జపమును' చేయడము. నామజపము చేయుట వలన మన స్థూల దేహము మాత్రమే కాకుండా, మన శరీరము చుట్టూ గల సూక్ష్మ దేహముల శుద్ధి కూడా అవుతుంది.
రోజుకి కనీసము 10 నిమిషాలు అయిన 'శ్రీ కుల దేవతయై నమః' అనే జపమును చెయ్యండి. ఎవ్వరికైతే తమ ఇలవేల్పు దేవత పేరు తెలుసో, వారు కుల దేవత పేరుకి బదులుగా ఆ దేవత పేరు పెట్టి చెయ్యండి..
ఉదాహరణకు మీ కుల దేవుడు వెంకటేశ్వర స్వామి అయితే 'శ్రీ వేంకటేశాయ నమః' అని, కుల దేవి భవాని మాతా అయితే 'శ్రీ భవాని మాతాయై నమః' అని చెయ్యండి..ఒక్కవేళ కుల దేవుడు మరియు కుల దేవి ఇద్దరూ ఉంటే, కుల దేవి పేరునే పలకండి...

ఉప్పు నీటి థెరపీ


వాతావరణములో ఉండే చెడు శక్తుల ప్రభావము వలన మనిషిలో తామసిక శక్తి (నల్ల శక్తి) వృద్ధి చెంది, అతనిలో నిరాశ, అనావశ్యక ఆలోచనలు,ఒత్తిడి, సరియైన నిర్ణయమును తీసుకోనలేక పోవడము మొదలగు సమస్యలు వస్తాయి. దీని పర్యావసానముగా ఈ చెడు శక్తి వలన వ్యసనములు, ఆర్థిక ఇబ్బందులు, చాతి నొప్పి మొదలుగునవి వస్తాయి.
ఈ ఉప్పు నీరు థెరపీ చేయుట వలన అధ్యాత్మికముగా ఉపాయము అయ్యి మన లోని కనిపించని నల్ల శక్తి బయటకు పోతుంది. ఆధ్యాత్మిక సాధన చేసే వారికి ఆధ్యాత్మిక బలము కూడా పెరుగుతుంది.



చేయు విధానము :-
ఒక్క బకెట్టులో అర మోకాళ్ళ ఎత్తు వరకు నీరు నింపి అందులో రాళ్ల ఉప్పు అంటే కళ్ళు ఉప్పుని గుప్పెడు వెయ్యాలి. తరువాత రెండు కాళ్ళను బకెట్టులో ఉంచి 12 నుండి 14 నిమిషాల వరకు 'శ్రీ కుల దేవతయై నమః' అని నామ జపమును చెయ్యాలి. తరువాత కాళ్ళను తీసి, ఆ బకెట్టులోని నీటిని మరుగుదొడ్డిలో పారవేయ్యాలి.

నాగ పంచమి

తన తండ్రి పాము కాటు వలన చనిపోవడముతో జన్మేజయ రాజు సర్ప యజ్ఞమును చేస్తారు. అప్పుడు అస్తిక మహర్షి వచ్చి రాజుని శాంతింపజేస్తారు. జన్మజేయుడు వరము కోరమని అడుగగా, సర్పయజ్ఞమును ఆపివేయమని మహర్షి అడుగగానే, జన్మజేయుడు సర్ప యజ్ఞమును అపివేస్తాడు. ఆ రోజే శ్రావణ శుక్ల పక్ష పంచమి..అదే నాగ పంచమి.


శ్రీ కృష్ణుడు ఏ రోజైతే కాల నాగుని యమునా నది వదిలి వెళ్ళమని చెబుతాడో, ఆ రోజే శ్రావణ శుక్ల పక్ష పంచమి..
భగవద్గీతలో తన గురించి వర్ణిస్తూ, శ్రీ కృష్ణుడు ‘‘నాగులలో కల్లా పెద్దది అయిన ‘అనంత’ని కూడా నేనే..’’అని చెబుతారు.
అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలం I
శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం, కాలియం తథా II
తొమ్మిది ప్రకారముల నాగులు – అనంత, వాసుకి, శేషుడు, పద్మనాభ, కంబల, శంఖపాల, ధృతరాష్ట్ర, తక్షక మరియు కాలియ లను పూజిస్తే సర్ప భయము తొలిగిపోతుంది.
ఈ రోజు క్రొత్త బట్టలు వేసుకొంటారు. పసుపుతో తొమ్మిది నాగులను గీసి, వాటికి పూజ చేస్తారు. ఈ రోజున కొయ్యడము, వేయించడము, పొయ్యిని వెలిగించడము చెయ్యరు. తవ్వడము కూడా ఈ రోజు నిషేధమైనది.

వాస్తు శాస్త్రం

వాస్తు అంటే నివాసగృహం/ప్రదేశం అని శబ్దార్థం. శాస్త్రం అంటే శాసించేది / రక్షించేది అని అర్ధం. వెరసి వాస్తు శాస్త్రం అంటే నివాసాల నిర్మాణాలలో విధి విధానాలను శాసించే ప్రాచీన భారతీయ నివాస నిర్మాణ శాస్త్రం.
ఇంటిలో వాస్తు మంచిగా ఉండటానికి క్రింది నియమాలను పాటించండి.



౧. స్నానపు గది తలుపు ఎప్పుడూ మూసే వుంచండి. ఎందుకంటే స్నానపు గదిలో రజ-తమ తరంగాలు ఎక్కువుగా వుంటాయి. తలుపు తెరిచి ఉంచటము వలన అవి ఇంటిలో గల సాత్వికతను దెబ్బతీస్తాయి.
౨. అద్దము వైపునకు చెడు శక్తులు ఎక్కువగా ఆకర్షితమవుతాయి. అందువలన నిద్ర గదిలో కాని, ఎక్కువ సమయము గడిపే గదిలో గాని అద్దములను పెట్టకుండా వరండాలో పెట్టుకొనవచ్చును.
౩. కొవ్వుత్తులను సాధ్యమైనంత వరకు వెలిగించవద్దు. ఎందుకంటే కొవ్వత్తులు రజ- తమ తరంగాలను ప్రక్షేపితము చేస్తాయి.
౪. 'సత్యం శివం సుందరం' అంటారు కాబట్టి ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రముగా ఉంచండి. అందువలన ఇంటిలో భగవంతుని తత్త్వ తరంగాలు వస్తుంటాయి.
5. ఇంటి తలుపులు-కిటికీలను సాధ్యమైనంత వరకు తెరచి ఉంచండి. ఇందువలన భగవంతుని చైతన్యము పంచతత్త్వాల (పృథ్వీ, నీరు, గాలి, నిప్పు(తేజము), ఆకాశము ) మాద్యమముగా ఇంటిలో ప్రవేశిస్తుంది.
౬. ఇంటి చుట్టూ ప్రక్కల సాత్త్విక మొక్కలను పెంచండి. ఉదా :- తులసి, మందార మొదలుగునవి.
౭. ఇంటి ముంగిట తూర్పు-పడమర లలో ఉండటము వలన భగవంతుని కణాలు(సూర్యుని నుండి వచ్చే) ఇంటిలో సులభముగా ప్రసరిస్తాయి.

మహాశివరాత్రిని ఎందుకు జరుపుకొంటారు?

శివరాత్రి నాడు శివుడు విరామము తీసుకొంటారు. రాత్రిలో ఒక్క ‘ప్రహరము’ సమయమున ఆయన విరామము తీసుకొంటారు. ప్రహరము అంటే మూడు గంటల సమయము. ఎప్పుడైతే శివ భగవానుడు విరామము తీసుకొంటారో, అప్పుడు ‘శివ తత్త్వము’ ప్రక్షిపించబడదు, అంటే వారు ధ్యానవస్థలో ఉంటారు. ఈ సమయమున వారు తన వ్యక్తిగత సాధనకు సమయము ఇస్తున్నట్లుగా భావించాలి. ఆ సమయములో, శివతత్త్వము ఎట్టి తామసిక గుణమును గాని, బ్రహ్మండములోని హాలాహలమును గాని స్వీకరించదు. అందువలన చెడు శక్తుల ప్రభావము పెరుగుతుంది. ఈ ప్రభావము నుండి కాపాడుకోవడానికి ‘బిల్వ పత్రము’, తెల్లని పువ్వులు, ‘రుద్రాక్ష’లను శివునికి సమర్పిస్తారు. ఇవి వాతావరణములోని ‘శివ తత్త్వమును’ ఆకర్షించి చెడు శక్తుల ప్రభావము నుండి రక్షిస్తాయి. 


 

‘జ్ఞానం ఇచ్చేత్ సదాశివాత్ l
మోక్షం ఇచ్చేత్ జనార్దనాత్ ll’
అనగా ఆధ్యాత్మిక జ్ఞానము కోసము శివుడిని మరియు మోక్షము కొరకు జనార్దుడిని(విష్ణువు) కొలవాలని అర్థము !

Friday 12 September 2014

శంఖ నాదము

శంఖమును పూజలో రెండు విధములుగా ఉపయోగిస్తారు. పూజకు ముందు ఒక్క శంఖమును పూరిస్తారు, మరొక్కటి పూజలో ఉపయోగిస్తారు. ఏ శంఖమును అయితే పూరించడానికి ఉపయోగిస్తారో, దానిని పూజలో పెట్టకూడదు. శంఖమును పూరించకుండా దేవాలయ తలుపులను తెరువరాదని ‘వరాహ పురాణము’లో చెప్పబడినది. వాతావరణములో సత్త్వ, రజ, తమో గుణ తరంగములు ఉంటాయి. ఇందులో రాజ, తమ గుణములు చెడుదాయకమైనవి. పూజా సమయములో సత్త్వ తరంగములు ఆకర్శించబడుతాయి. ఇవి పూజ చేసేవారికి లభించకుండా చెడు తరంగములు ఇబ్బందిని కల్గిస్తాయి.


ఎప్పుడైతే పూజకు ముందు శంఖమును పూరిస్తామో, అప్పుడు శంఖము నుండి శక్తి వెలువడుతుంది. ఈ శక్తి చెడుదాయక తరంగములను నాశనము చేస్తుంది. దీనితో పాటుగా చైతన్య కవచము పూజా ఉపకరణముల చుట్టూ నిర్మాణము అవుతుంది.
శంఖ నాదము వలన మరొక్క లాభము కూడా ఉంది. శంఖమును పూరించినప్పుడు, బ్రహ్మాండములో గల విష్ణు తత్త్వము కార్యగతము అయ్యి, పూజా ప్రదేశంలో ఆకర్శించబడుతుంది. దీని వలన పూజా చేసే వారితో పాటుగా శంఖమును ఊదిన వారికీ, శంఖ నాదమును విన్నవారికి కూడా దీని లాభము కలుగుతుంది.

Sunday 31 August 2014

శ్రీ గణేశుడు ఏకదంతుడు ఎలా అయ్యారు ?

కార్తవీర్యుడిని వధించిన తరువాత పరుశురాముడు కైలాషమునకు వెళ్లారు. అక్కడ అన్ని గణములతో కలిసి గణాధీషుడు ఉన్నారు. శంకురుడిని దర్శించుకోవాలనే ఇచ్చ పరుశురమునికి కలిగినది. కానీ, ఆ సమయములో శివ-పార్వతులు విశ్రాంతి తీసుకొనడము వలన గణేశుడు ‘కొద్ది సేపు నిరీక్షణ చెయ్యమని’ చెప్పారు.



కానీ పరశురాముడు వినకుండా చేతిలో పరశు ని తీసుకొని నిర్భయముగా వెళ్ళసాగారు. అప్పుడు గణేశుడు ప్రేమతో మరియు వినయముతో ఇంకోసారి ఆపారు. క్రోధముతో అతనిని చంపేందుకు పరశురాముడు పరశుని ఎత్తారు. అయిన సరే, ధర్మాన్ని సాక్షిగా తీసుకొని శ్రీ గణేశుడు అపసాగారు. అయిన పరశురాముడు వినకపోయే సరికి గణేశుడు తన తొండమును పెద్దగ చేసి పరశురాముడిని అందులో ఇరికించి సప్త లోకములలో త్రిప్పసాగాడు. అప్పుడు పరశురాముడు, గురు దత్త ఇచ్చిన స్తోత్ర కవచమును పటించి, పరశుని గణేశుని మీదకు విసురుతాడు.  దానిని వ్యర్థము చేసేందుకు శ్రీ గణేశుడు ఎడమ దంతమును విసురుతాడు. అప్పుడు పరశు అస్త్రము వ్యర్థము అవుతుంది; కానీ గణేశుని దంతము విరిగిపోతుంది.
 

Saturday 30 August 2014

గణపతి పదమునకు అర్థము ఏమిటి ?

గణ+పతి = గణపతి, సంస్కృత నిఘంటువు అనుసారముగా 'గణ' అంటే పవిత్రకాలు. పవిత్రకాలు అంటే సుక్ష్మతి సుక్ష్మ చైతన్య కణాలు. 'పతి' అంటే పాలించేవాడు(స్వామి). గణపతి అంటే పవిత్రకములకు స్వామి అని అర్థము.





గణపతి దేవునికి వివిధ పేర్లు ఉన్నాయి. అవి -
వక్రతుండ, ఏక దంత, లంబోదర, భాలచంద్ర, వినాయక, మంగళ మూర్తి, విద్యాపతి, మరియు చింతామణి.

వివిధ యుగములలో వీరి అవతారములు -
మహోత్కట వినాయకుడు - సత్య యుగము
గుణేశ - త్రేతా యుగము
గజాననా - ద్వాపర యుగము
దుమ్రకేతు - కలి యుగము  (ఈ అవతారము కలియుగములో కానున్నది. ఈయన ధూమ్ర వర్ణములో ఉంది మ్లేచ్చులను నాశనము చేస్తారని భవిష్య పురాణములో చెప్పడమైనది.

Friday 29 August 2014

శ్రీ గణపతికి గరికను ఎందుకు సమర్పిస్తారు ?




గరిక అనేది ఒక్క ప్రత్యేకమైన పవిత్ర గడ్డి. గణపతి దేవుని నుండి వెలువడే పవిత్రకములను ఇది ఎక్కువుగా గ్రహించి, ప్రక్షేపిస్తుంది. గరికలో మూల శివ, శక్తి మరియు గణపతి తత్త్వములను ఆకర్షించే శక్తి కూడా ఉంది. అందువలనే గరికను శ్రీ గణపతి పూజకు ఉపయోగిస్తారు. గణపతికి మూడు లేదా అయిదు ఆకులు గల గరికను సమర్పిస్తారు. గణపతికి  కనీసము 21 సంఖ్యలో గరికలను సమర్పించాలి. వీటిని కట్టి, నీళ్ళల్లో ముంచి అర్పించాలి. గణపతి దేవుని శిరస్సుని వదిలి మిగతా శరీర భాగమంతా గరికతో కప్పవలెను. ఇందువలన గరికలోని సుగంధము మూర్తి చుట్టూ వ్యాపిస్తుంది.

Saturday 26 July 2014

గోమాత ఎలా ఉద్భవించినది?

 ఆవు పుట్టుక గురించి శతపథ బ్రాహ్మణ గ్రంథములో ఈ విధముగా ఉంది. దక్ష ప్రజాపతి ప్రాణిసృష్టి చేసిన పిమ్మట కొంచెము అమృతమును త్రాగారు. త్రాగిన తరువాత వారు ప్రసన్నమయ్యారు. ఆ సమయములో వారి శ్వాస ద్వార సుగంధము వెలువడి అంతటా ప్రసరించినది. ఆ శ్వాస నుండి ఒక్క ఆవు జన్మించినది. సుగంధము ద్వార జన్మించుట వలన దక్ష ప్రజాపతి దానికి ‘సురభి’ అని పేరు పెట్టారు. సురభి నుండి అనేక ఆవులు జన్మించాయి. అందుకనే సురభిని గోవంశమునకు మాతగా, జననీగా పరిగణిస్తారు.


సురభి ఒక్కసారి తపస్సునారంభించనది. బ్రహ్మ దేవుడు ఆ తపస్సునకు మెచ్చి సంతుష్టుడయ్యారు. సురభికి అమరత్వమును ప్రసాదించారు. త్రిలోకముల కన్నా పైన ఉండే స్వర్గమును వరముగా ఇచ్చారు. దీనిని స్వర్గ గోకులమనే పేరుతొ పిలుస్తారు. గోలోకములో సురభి నిత్యమూ నివసిస్తుంది, ఈమె కన్యలు, సుకన్యలు భూలోకములో నివసిస్తారు. ఈ గోలోకమునకు అధిపతి గోవిందుడు అనగా శ్రీ కృష్ణుడు. శ్రీకృష్ణ పరమాత్ముడు ‘గోప్రేమికుడు’ అని అంతటా ప్రాచుర్యమైనదే !

Monday 26 May 2014

'మానవుడు శాఖహారమును భుజిస్తే' ధర్మమును పాటిస్తున్నట్లుగా ఎలా చెబుతాము ?




'శాఖాహారము మనుష్యుడిని సత్త్వ గుణిగా మారుస్తుంది. మానవ జన్మను సార్థకము చేసే సత్త్వ గుణ ఆహారమును భుజించడము అంటే ధర్మ పాలన చేస్తున్నట్లు. ధర్మ పాలన అంటే యోగ్య ఆహార సంహితను స్వీకరించి, దాని అనుసారముగా ఆచరిస్తూ ధర్మమును, దాని పరిణామముగా భగవంతుడిని ఇష్ట పడటము. శాఖాహారము వలన దేహములోని తమో గుణము లయము అవుతుంది. నరుడిని నారాయణుడిగా మార్చే కార్యమును శాఖాహారము చేయగలదు, కావున ధర్మ పాలన చేసినట్లు అవుతుంది.
- ఒక్క విద్వాంసుడు (సౌ. అంజలి గాడ్గిల్ గారికి లభించిన జ్ఞానము)

Thursday 22 May 2014

మహాభారతమును ‘ధర్మ యుద్ధము’ అని ఎందుకు అంటారు ?


మహాభారతములోని మొదటి మూడు రోజులలో అనేక కౌరవ బంధువులు మరియు వీరులు పాండవుల చేతిలో మరణించారు. పాండవుల పక్షములో ఏ ప్రముఖ సేనాని మృత్యువు కూడా అప్పటి వరకు అవ్వలేదు. అప్పుడు దుర్యోధనునికి కోపము వచ్చి, భీష్ముడిని అడుగుతాడు. అప్పుడు భీష్ముడు ‘రేపు 5 బాణాలతో అయిదుగురు పాండవులను చంపుతాను’ అని అంటారు. అప్పుడు దుర్యోధనుడు ‘ఏ అయిదు బాణాల చేత చంపదలుచుకోన్నారో, ఆ బాణాలు నాకు ఇవ్వండి. ఉదయమే నేను తెచ్చి ఇస్తానని’ అంటాడు. అప్పుడు భీష్ముడు అయిదు బాణాలను మంత్రించి దుర్యోధనుడికి ఇస్తాడు.
 
ఈ విషయము శ్రీ కృష్ణ భగవానునికి తెలిసిపోతుంది. అప్పుడు అయన ఒక ఉపాయము చెబుతారు. పాండవులు వనవాసములో ఉన్నప్పుడు, దుర్యోధనుడు ఒక్కసారి అరణ్యమునకు వెళ్ళతాడు. ఆ సమయములో అర్జునుడు అతని ప్రాణాలను రక్షిస్తాడు. అప్పుడు దుర్యోధనుడు ఏదైనా వరమును కోరమన్నప్పుడు, ‘అవసరము వచ్చినప్పుడు అడుగుతాను, అప్పుడు తప్పక తీర్చమని’ అర్జునుడు చెబుతాడు.
శ్రీ కృష్ణుడు అర్జునుడి యుద్ధ శిబరమునకు వెళ్లి ఆ అయిదు బాణాలను దుర్యోధనుడిని అడిగి తీసుకు రమ్మంటాడు. అర్జునుడు దుర్యోధనుడి దగ్గరకు వెళ్లి ఆ అయిదు బాణాలను అడుగుతాడు. అప్పుడు దుర్యోధనుడు తాను ఇచ్చిన మాట అనుసారముగా ఆ అయిదు బాణాలను అర్జునుడికి ఇచ్చేస్తాడు; అందుకే ఈ యుద్దమును ‘ధర్మ యుద్ధము’ అని అంటారు.

Tuesday 6 May 2014

గంగా నది ఆధ్యాత్మిక వైశిష్ట్యము

జ్ఞానం మహేశ్వజరాత్ ఇచ్చేత్ మోక్షం ఇచ్చేత్ జనార్ధనాత్ l , అనగా శివుని వద్ద జ్ఞానము మరియు విష్ణువు వద్ద మోక్షమును కోరవలెను.శంకరుడు జ్ఞానమయుడు అగుట వలన శివుని జట నుంచి ప్రవహించే గంగా నది కూడా సరస్వతి నది మాదిరిగా జ్ఞాన దాయకము అయినది  - ప.పూ. డా. ఆఠవలె

 

గంగా నది దశాహరము. అది శారీరిక, వాచిక, మానసికలను కల దశ పాపములను హరిస్తుంది అనగా నాశనము చేస్తుంది.
శారీరిక పాపములు : - ౧. దొంగతనము, ౨. హింస, ౩. పరస్త్రీ గమనము 
వాచిక పాపములు :- ౧. అబద్ధములు చెప్పుట, ౨. కఠోరముగా మాట్లాడుట, ౩. నిందించుట, ౪. అసంబద్దముగా, ఆకారణముగా మాట్లాడుట 
మానసిక పాపములు :- ౧. ఇతరుల ధనమును దొంగాలిద్దమనే ఆలోచన వచ్చుట, ౨. ఇతరుల గురించి చెడుగా ఆలోచించుట మరియు ౩. దురగ్రహము 
- గురుదేవులు డా. కాటేస్వామిజి