Sunday 5 May 2013

అక్షయ తృతీయ

‘’మదనరత్న’’ పవిత్ర గ్రంథములో వైశాఖ తృతీయ గురించి చెప్పబడినది.
(శ్రీ కృష్ణుడు చెబుతారు) ఓ యుధిష్టిరా, ఈ రోజు చేసే దానము మరియు హోమము ఎప్పడికి క్షయము కావు.
ఈ కారణము చేతనే ఋషి-మునులు ఈ తిథికి అక్షయ తృతీయ అని పేరు పెట్టారు. ఈ రోజు చేసే దానము వలన పుణ్యాబలము పెరుగుతుంది. దీని ఫలితముగా దానము చేసిన వ్యక్తికీ స్వర్గప్రాప్తి లభించును. అక్షయ తృతీయ నాడు దేవతలు మరియు పితురులకు తృప్తి కొరకు చేసే కర్మ కూడా అక్షయము అనగా అవినాశము అవుతుంది.  
అక్షయ తృతీయ మూడున్నర ముహుర్తలలో ఒకటి. ఈ రోజున త్రేతాయుగము ఆరభము అయ్యిందని కొన్ని చోట్ల చెబుతారు. ఈ రోజున అభ్యంగస్నానము మరియు దాన ధర్మాలు చేస్తారు. ఈ రోజున విష్ణు భగవానునికి పూజను చెయ్యడము, నామజపము చెయ్యడము, హోమాలు మరియు పిత్రుతర్పణమును చేస్తారు. కొందరు సూర్యుడి ఎండ నుండి కాపాడుకొనుటకు గొడుగులను మరియు చెప్పులను కూడా దానము చేస్తారు.
ఈ రోజున ఎవ్వరైతే ‘సత్పాత్ర దానము’(అనగా ధనమును స్వీకరించే వ్యక్తీ, ఆ దానమునకు సత్పత్రుడు అయ్యి ఉండాలి)ను చేస్తారో, వారు పూర్వ జన్మలో చేసిన పాపములు తగ్గి, మోక్ష మార్గ దిశగా ముందుకు వెళ్ళతారు. అందుకనే దానము చేస్తే సత్పాత్రునికే చెయ్యాలి.
ఈ రోజున ఉన్నత లోకముల నుండి సాత్త్విక లహరులు భూమి మీదకు ప్రసరిస్తాయి. అందుకని మరణించిన కొన్ని లింగ దేహములు ఆ సాత్వికతను పొంది ఉన్నత లోకాలను పోవాలని పరితపిస్తుంటాయి. అందువలన ఈ రోజు పితురులకు తిల తర్పణము చేస్తారు. జలము మరియు నువ్వులను కలిపి దేవతలు మరియు పితురులకు సమర్పించడమే తిల తర్పణము. ‘తిలము’ సాత్వికమైనవి మరియు జలము భావమునకు ప్రతీకమైనది.
తిల తర్పణము చేసేటప్పుడు ‘నేను భగవంతునికి సమర్పిస్తున్నాను’  అనే అహం భావమును ప్రదర్శించకుండా ‘భగవంతుడే నా నుండి చేయించుకొంటున్నారు’ అనే భావముతో సమర్పిస్తే ఆ దేవతలు ఎక్కువ ప్రసన్నము అవుతారు.



తిల తర్పణము చేసే పద్దతి
మొదట దేవతలను ఆహ్వానించాలి. ఒక్క సాత్విక ప్లేటుని (రాగి గాని వెండి గాని) తీసుకోవాలి. బ్రహ్మను మరియు విష్ణుమూర్తిని లేదా వారిద్దరు గల దత్త రూపమును ఆ ప్లేటులో ఆహ్వానించాలి. తరువాత, దేవతలు నిజముగానే మన ఎదుట ఉన్నారు అనే భావమును పెట్టుకోవాలి. ‘నువ్వుల’ను చేతిలో తీసుకొని శ్రీ విష్ణు మరియు బ్రహ్మ తత్త్వము ఆ నువ్వులలో ఉంది అనే భావముతో దేవతల చరణాలకు అర్పించాలి. 
మరొక ప్లేటుని తీసుకోవాలి. మన పితురులు ఎదురుగ ఉన్నట్లుగా భావించాలి. నువ్వులలో దేవతల తత్త్వము వస్తుంది అనే భావమును పెట్టుకోవాలి. రెండు నిమిషాల తరువాత దేవుని సాత్వికత అందులో వచ్చింది అని భావిస్తూ పితురుల చరణముల మీద వదులుతున్నాము అనే భావముతో తిల తర్పణము చెయ్యాలి.
అహం భావము లేకుండా. పూర్తీ భావముతో ఎంతగా పైనే చెప్పినది చేస్తాము అంతగా మనలో సాత్వికత లభిస్తుంది మరియు పితృ ఋణమును తీర్చిన వాళ్లము అవుతాము.
అధిక వివరాలకు http://www.hindujagruti.org/hinduism/festivals/akshay-tritiya/ చుడండి..