Tuesday 18 June 2013

కేదార్నాథ్ లో వరదలు-భీభత్సము

కేదార్నాథ్ లో వరదలు-భీభత్సము , చాల మంది మృత్యువాత, లక్ష మందికి పైగా నిరాశ్రయులు !!
अतिवृष्टि: अनावृष्टि: शलभा मूषका: शुका: ।
स्वचक्रं परचक्रं च सप्तैता ईतय: स्मृता: ॥ - कौशिकपद्धति

(రాజు ధర్మాచారి కాకపోతే ప్రజలు ధర్మాన్ని పాటించరు. ప్రజలు ధర్మాచరణ చెయ్యకపోతే) అతివృష్టి, అనావృష్టి, మిడతల ఆక్రమణ, ఎలుకల స్వైర విహారం, చిలుకల ఉపద్రవము, అందరి మధ్య కొట్లాటలు, శత్రువుల ఆక్రమణ మొదలగు ఏడు రకముల ప్రమాదాలు నెలకోంటాయి..
దీని తాత్పర్యము ఏమనగా రాజు, ప్రజలు ఇద్దరు కూడా సాధన చెయ్యాలి. అప్పుడే దేశము, ధర్మమూ సురక్షితముగా ఉండి, ఎటువంటి సంకటాలు రావు..

కావున మీ దినచర్యలో సాధనకు కూడా చోటుని ఇవ్వండి. రోజుకి కనీసము ఒక్క గంట అయిన సమయమును కేటాయించండి. ''శ్రీ కుల దేవతయై నమః'' అని నామ జపమును చెయ్యండి. మీ కుల దేవత వెంకటేశ్వర స్వామి అయితే ''శ్రీ వేంకటేశాయ నమః'' అని చెయ్యండి.